వారణాసిని మరిచి పోలేను
యూపీ నా గుండెల్లో భద్రం
ఉత్తర ప్రదేశ్ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు గుజరాత్ జన్మ నిస్తే ఉత్తర ప్రదేశ్ రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందని అన్నారు. తన జీవిత కాలంలో ఊపిరి ఉన్నంత కాలం యూపీని మరిచి పోలేనని చెప్పారు.
గురువారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ లోని అజంగఢ్ లో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ కూడా పాల్గొన్నారు.
ప్రజలు తన పట్ల కురిపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలను తాను ఎల్లప్పుడూ మరిచి పోయే ప్రసక్తి లేదన్నారు ప్రధానమంత్రి. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీకి కనీసం 400కు పైగానే వస్తాయని మరోసారి తాను పీఎం కాబోతున్నానని చెప్పారు.
దేశ చరిత్రలో వరుసగా మూడోసారి ఇతర పార్టీకి చెందిన వ్యక్తిని తాను కావడం తనకు మరింత సంతోషం కలిగిస్తోందని అన్నారు నరేంద్ర మోదీ. ఇక భారతీయ కూటమికి అంత సీన్ లేదన్నారు. ఆ కూటమికి కనీసం 40 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.