ఏపీ ఫలితాలు చూసి షాక్ అవ్వాలి
వైసీపీకి పక్కా 151 సీట్లు అన్న జగన్
విజయవాడ – ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన సంచలన ప్రకటన చేశారు. గురువారం విజయవాడలో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఐ ప్యాక్ బృందంతో జగన్ రెడ్డి భేటీ అయ్యారు. వారందరినీ పేరు పేరునా అభినందనలతో ముంచెత్తారు. మీరు చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో వైసీపీ మరోసారి చరిత్ర సృష్టించ బోతోందని చెప్పారు. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాలను చూసి దిమ్మ తిరగాలని అన్నారు. ఆ రిజల్ట్స్ టీడీపీ కూటమికి నిద్ర పోకుండా చేస్తాయని ప్రకటించారు. ఆరు నూరైనా సరే వైసీపీ గెలుపును ఏ శక్తి ఆప లేదన్నారు జగన్ మోహన్ రెడ్డి.
తమ పార్టీకి కనీసం 175 స్థానాలకు గాను 151 స్థానాలు వస్తాయని చెప్పారు. ఇందు కోసం పేరు పేరునా తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. లబ్ది పొందిన ప్రతి ఒక్కరు తనను ఆదరిస్తారని తనకు తెలుసన్నారు జగన్ రెడ్డి.