ఏపీ సీఎం జగన్ రెడ్డి వైరల్
ఐ ప్యాక్ బృందంతో హ్యాపీ
విజయవాడ – ఏపీ సీఎం , వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఆయన చర్చనీయాంశంగా మారారు. ఓ వైపు ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా జరిగినా అక్కడక్కడా ఇంకా చెదురు మదురు సంఘటనలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తను త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటికే సీబీఐ కోర్టు పర్మిషన్ కూడా ఇచ్చేసింది.
ఓ వైపు టీడీపీ కూటమి తామే అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్నా ఎక్కడో తేడా కొడుతోంది. మరో వైపు పూర్తి నమ్మకంతో, ఆత్మ విశ్వాసంతో, అత్యంత ఆనందంగా ఉన్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. గురువారం ఆయన తన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ వచ్చిన ఐ ప్యాక్ టీంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు విజయవాడలో.
ఈ సందర్భంగా పేరు పేరునా వారిని అభినందనలతో ముంచెత్తారు. మీరు అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను , సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మీ మేలు మరిచి పోనని పేర్కొన్నారు.