కాషాయానికి కూటమి కాటు తప్పదు
నిప్పులు చెరిగిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికల్లో నిరంతరం అబద్దాలతో పాలన సాగిస్తున్న కాషాయ పార్టీకి కాటు తప్పదన్నారు . పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూఢిల్లీలో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా భారత కూటమి తరపున బరిలోకి దిగిన అభ్యర్థులకు మద్దతుగా క్యాంపెయన్ నిర్వహించారు.
ఈ సందర్బంగా భారీ ఎత్తున రోడ్ షో, ర్యాలీ చేపట్టారు. అడుగడుగునా అరవింద్ కేజ్రీవాల్ కు బ్రహ్మరథం పట్టారు. పదే పదే మోదీ చెబుతున్న మోస పూరితమైన మాటలను జనం నమ్మడం మానేశారని అన్నారు. ఆయనకు చుక్కలు చూపించడం ఖాయమన్నారు కేజ్రీవాల్.
400 సీట్లు వస్తాయనే భ్రమల్లో మోదీ ఉన్నారని, కనీసం 200 సీట్లు కూడా దాటవన్నారు. మీ అందరి ఆదరాభిమానాలను చూస్తుంటే కనీసం భారత కూటమికి మేజిక్ ఫిగర్ కు కావాల్సిన సీట్లను దక్కించు కుంటాయని అన్నారు ఢిల్లీ సీఎం.
తనను లేకుండా చేయాలని, ఆప్ ను అంతం చేయాలని అనుకున్న మోదీకి, షాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంప పెట్టు లాంటిదన్నారు.