NEWSNATIONAL

400 సీట్లు ఖాయం మోదీ పీఎం

Share it with your family & friends

బీజేపీ చీఫ్ అన్నామ‌లై కామెంట్

త‌మిళ‌నాడు – సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మికి 400 సీట్లు రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై కుప్పు స్వామి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంద‌న్నారు. మ‌రోసారి చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన భార‌త కూట‌మికి క‌నీసం 40 సీట్లు కూడా రావ‌ని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా 143 కోట్ల మంది భార‌తీయులంతా ముక్త కంఠంతో ప్ర‌ధాన మంత్రిగా మ‌రోసారి మోదీ కావాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు. సుస్థిర‌మైన పాల‌న‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని ఆశిస్తున్నార‌ని పేర్కొన్నారు కె. అన్నామ‌లై.

ద‌క్షిణాదిన ఈసారి బీజేపీ అత్య‌ధిక సీట్ల‌ను కైవ‌సం చేసుకోవ‌డం త‌ప్ప‌ద‌న్నారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ల‌లో ఊహించ‌ని విధంగా సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్‌. మొత్తంగా 400 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని అన్నారు.