వైసీపీ దాడులు దారుణం
ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుండడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ పాలన పూర్తిగా రాచరికాన్ని తలపింప చేస్తోందని ఆరోపించారు. పోలింగ్ పూర్తయినా పనిగట్టుకుని తమ వారిని టార్గెట్ చేశారని, వ్యక్తిగతంగా హింసించడమే కాకుండా భౌతికంగా దాడులకు దిగడం దారుణమన్నారు నారా లోకేష్.
ఇది కేవలం మహిళలపై దాడి మాత్రమే కాదు ప్రజాస్వామ్యం పైనే దాడిగా అభివర్ణించారు. ఓటమి ఖాయమని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ గూండాలు రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
. అక్కిరెడ్డిపాళెంలోని 68వ వార్డులో ఇద్దరు అమాయక మహిళలను తమకు ఓటు వేశారనే నెపంతో దారుణంగా దాడి చేశారని వాపోయారు. అమానవీయ చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని తేలి పోయిందన్నారు.