అబద్దాలకు మోదీ అంబాసిడర్
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
ఉత్తరప్రదేశ్ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆమె ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేస్తున్నారు. ప్రస్తుతం బిజీగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా యూపీపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలుమార్లు సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని ఉత్సాహ పరిచారు.
ఇదిలా ఉండగా తన సోదరుడు, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రస్తుతం రాయ్ బరేలితో పాటు వాయనాడు నుంచి లోక్ సభ ఎంపీగా బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు ప్రియాంక గాంధీ.
అబద్దాలు చెప్పడంలో, మోసం చేయడం, ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడంలో దేశంలో నెంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.