NEWSNATIONAL

మోదీ నాయ‌క‌త్వం దేశానికి అవ‌స‌రం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన బీజేపీ చీఫ్ అన్నామ‌లై

మ‌హారాష్ట్ర – ఈ దేశానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మిళ‌నాడు రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై కుప్పుస్వామి . త‌మ పార్టీకి 400 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని చెప్పారు.

దేశ వ్యాప్తంగా ప్ర‌ధాని మోదీ గాలి వీస్తోంద‌న్నారు. విశేష్ సంప‌ర్క్ అభియాన్ లో భాగంగా ముంబైలోని ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా వారితో చ‌ర్చ‌లు జ‌రిపారు. ప‌లు సూచ‌న‌లు , స‌ల‌హాలు తీసుకున్నారు.

మోదీ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వంలో దేశం ముందుకు వెళుతోంద‌ని చెప్పారు కె. అన్నామ‌లై. దేశం అభివృద్ది చెందాలంటే, అన్ని రంగాల‌లో స‌త్తా చాటాలంటే పారిశ్రామిక‌వేత్త‌ల మ‌ద్ద‌తు అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

తాము ఎక్క‌డికి వెళ్లినా జ‌నం అద్భుతంగా ఆద‌రిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మికి బిగ్ షాక్ త‌ప్ప‌ద‌న్నారు కె. అన్నామ‌లై.