ఇండియా కూటమిదే విజయం
ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ – ఇండియా కూటమి ఈశాన్య ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి కన్హయ్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా సరే తాము గెలుపొందడం తప్పదన్నారు. పదేళ్ల కాలంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్హయ్య కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పహ్లా పుష్టాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ ఉన్నా లేనట్టేనని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
ఓ వైపు జనం ఇబ్బందులు పడుతుంటే తను మాత్రం ఎంజాయ్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈసారి ఎంపీకి చుక్కలు చూపించాలని పిలుపునిచ్చారు. తాను గెలిచిన వెంటనే ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తనకు బంగ్లాలు, వాహనాలు, దాచుకునేందుకు డబ్బులు ఏవీ లేవన్నారు. తాను అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడినని పేదల ఇబ్బందులు ఏమిటో బాగా తెలుసన్నారు కన్హయ్య కుమార్.