NEWSNATIONAL

దేశం కోసం జీవితం అంకితం

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

న్యూఢిల్లీ – తాను త‌న కోసం ప‌ని చేయ‌డం లేద‌ని దేశం కోసం ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. ప్ర‌ముఖ జాతీయ ఛాన‌ల్ తో ఆయ‌న సంభాషించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానాలు ఇచ్చారు.

నేను ఎప్పుడూ నా స్వ‌లాభం కోసం ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని చెప్పారు. త‌న‌కు ఉండేందుకు ఇల్లు లేద‌ని, ప్ర‌యాణం చేసేందుకు స్వంత కారు కూడా లేద‌ని అన్నారు న‌రేంద్ర మోదీ. ప్ర‌స్తుతం త‌న చేతిలో 52 వేల రూపాయ‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ని వీటినే న‌మ్ముకుని తాను బ‌తుకుతున్న‌ట్లు తెలిపారు.

చాలా మంది అనుకున్న‌ట్లు తన వ‌ద్ద పెద్ద ఎత్తున ధ‌నం ఉంటుంద‌ని భావిస్తున్నార‌ని, దీనికి ఎగ దోస్తున్న‌ది, దుష్ప్ర‌చారం చేస్తున్న‌ది ఎవ‌రో కాదు ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మికి చెందిన నేత‌లంటూ మండిప‌డ్డారు.

తాను విమ‌ర్శ‌ల‌ను, ఆరోప‌ణ‌ల‌ను ప‌ట్టించు కోన‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పాల‌న‌లో గాడి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశాన‌ని, ఇవాళ దేశం అన్ని రంగాల‌లో ముందుకు వెళుతోంద‌ని దీనికి తానే కార‌ణ‌మ‌న్నారు. త‌మ‌కు 400 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని చెప్పారు మోదీ.