కేజ్రీవాల్ కేసుపై సుప్రీం విచారణ
అరెస్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలు పాలై ఇటీవలే మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్బంగా ఆయన విస్తృతంగా భారత కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా పర్యటిస్తున్నారు. జనాన్ని చైతన్యవంతం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. తన సమక్షంలోనే ఆయన నివాసంలో వ్యక్తిగత కార్యదర్శి మహిళా హక్కుల కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ పై దాడికి దిగారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేజ్రీవాల్ పీఎస్ పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.
ఇదిలా ఉండగా ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. మధ్యాహ్నం తర్వాత సుదీర్ఘంగా విచారణ చేపట్టి తుది తీర్పు వెలువరించనుంది. కాగా కేజ్రీవాల్ కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.