NEWSTELANGANA

కిష‌న్ రెడ్డిపై రాముల‌మ్మ కామెంట్

Share it with your family & friends

అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా

హైద‌రాబాద్ – మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య శాంతి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా శుక్ర‌వారం ఆమె తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి, రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డిపై మండిప‌డ్డారు.

తెలంగాణ ప్రాంతం అస్తిత్వం గురించి తెలుసు కోకుండా మాట్లాడటం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లో ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండ‌దంటూ పేర్కొన‌డం పై ఆమె స్పందించారు. ద‌క్షిణాదిలో స్వీయ అస్విత్వం కోసం ఎప్పుడూ పోరాటం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఆ మాత్రం తెలుసుకోకుండా మాట్లాడ‌టం త‌న‌కు త‌గ‌ద‌ని సూచించారు.

ప్రాంతీయ భావోద్వేగాలు , ప్ర‌జా మ‌నోభావాల‌ను అర్థం చేసుకోక పోవ‌డం, కేవ‌లం కొంద‌రికే ల‌బ్ది చేకూర్చేలా ప్ర‌య‌త్నం చేస్తున్న, పాల‌న సాగిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి జ‌నం బాధ‌లు ప‌ట్ట‌వ‌న్నారు.
ద‌శాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసిపి దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు విజ‌య శాంతి .