కవితపై కక్ష కట్టారు – ఆర్ఎస్పీ
ఆమె అరెస్ట్ చట్ట విరుద్దం
న్యూఢిల్లీ – బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలుసుకున్నారు ఆర్ఎస్పీ , మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
పరామర్శ అనంతరం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కవితకు ఏ పాపం తెలియదని అన్నారు. ఆమెను కావాలని కక్ష కట్టి జైలులో వేశారని ఆరోపించారు. ఆమె స్వచ్చందంగా నిజాయితీగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే విడుదలై బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కవిత అరెస్ట్ పూర్తిగా చట్ట విరుద్దమని ఆరోపించారు. అనైతికం కూడా. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీ సర్కార్ తనకు కావాల్సిన వాళ్లకు అందలం ఎక్కిస్తోందని, కాని వారిని చెరసాలలోకి నెట్టి వేస్తోందని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఇప్పటికే ఇదే కేసులో పలువురు కీలక నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.