NEWSNATIONAL

స‌మ‌స్య‌ల ఊసెత్త‌ని ప్ర‌ధాని

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

ఉత్త‌ర ప్ర‌దేశ్ – సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ తాను ఏదో సాధించిన‌ట్లు ప‌దే ప‌దే స్వంత డ‌బ్బా కే ప్ర‌యారిటీ ఇస్తున్నారంటూ రాహుల్ గాంధీ మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా యూపీలోని అమేథిలో శుక్ర‌వారం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు.

ఈ మ‌ధ్య‌న ఎక్క‌డ చూసినా తాను ఎంపిక చేసుకున్న ఛాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నార‌ని, కేవ‌లం ఈ దేశం న‌డుస్తోందంటే త‌న వ‌ల్ల‌నేన‌ని గొప్ప‌లు చెబుతున్నార‌ని ఆరోపించారు. ప‌దేళ్ల పాల‌నలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్ర‌జ‌ల గురించి, తాను ఇచ్చిన హామీల గురించి ప్ర‌స్తావించ‌డం లేద‌న్నారు.

ఎంత సేపు ప్ర‌చార యావ త‌ప్పిస్తే తాను చేసింది ఏమీ ఈ దేశానికి లేద‌న్నారు రాహుల్ గాంధీ. త‌న ప‌రివారానికి చెందిన మీడియాకే ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తున్నార‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జ‌లు మేల్కొన్నార‌ని ఇక ఆయ‌న‌కు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు .