NEWSNATIONAL

కూట‌మిని చూస్తే మోదీకి భ‌యం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సంజ‌య్ రౌత్

ముంబై – శివ‌సేన యూబీటీ స్పోక్స్ ప‌ర్స‌న్ , రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాళ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి , దాని అనుబంధ పార్టీల‌కు ఏమీ పాలు పోవ‌డం లేద‌న్నారు. మోదీ ప‌దే ప‌దే 400 సీట్లు వ‌స్తాయ‌ని బాకాలు ఊదుతున్నాడ‌ని, కానీ ఆ పార్టీకి, ఆయ‌న‌కు అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు.

తాము భార‌తీయ కూట‌మి త‌ర‌పున ర్యాలీ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్పారు. ఇందు కోసం ముంబై లోని శివాజీ పార్క్ కోసం సిద్దం కూడా చేశామ‌న్నారు. కానీ బీజేపీ, దాని కూట‌మి అధికారంలో ఉన్నాయ‌ని, మ‌మ్మ‌ల్ని ఆపేందుకు వారు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు సంజ‌య్ రౌత్.

విచిత్రం ఏమిటంటే వారు ప్ర‌ధాన మంత్రి మోదీ పేరు చెప్పి శివాజీ పార్కును ఇచ్చేందుకు ఒప్పు కోవ‌డం లేద‌న్నారు. రోజు రోజుకు మోదీ చ‌రిష్మా త‌గ్గుతోంద‌న్నారు. నిన్న‌టి దాకా ఠాక్రేతో ఉన్నాడు..ఇప్పుడు రాజ్ తో జ‌త క‌ట్టాడు. రేపు ఇంకెవ‌రితో ఉంటాడో తెలియ‌ద‌న్నారు. ఏది ఏమైనా ఇండియా కూట‌మి ర్యాలీ కొన‌సాగి తీరుతుంద‌ని హెచ్చ‌రించారు సంజ‌య్ రౌత్.