ఆప్ నుంచి పిలుపు లేదు
బాంబు పేల్చిన భజ్జీ
న్యూఢిల్లీ – ప్రముఖ క్రికెటర్ , ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ బాంబు పేల్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేళ ఆప్ తో పాటు ఇండియా కూటమి తరపున ప్రచారం చేసేందుకు తనకు ఆప్ నుంచి పిలుపు రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలా పిలుపు రాకుండా తాను ఎలా క్యాంపెయిన్ లో పాల్గొంటానని భజ్జీ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నా అంతకు నేను ప్రచారానికి వెళ్లాలని అనుకోవడం లేదన్నారు హర్భజన్ సింగ్.
పార్టీతో తనకు సంబంధం లేదని, తాను కచ్చితంగా రామ మందిరాన్ని సందర్శిస్తానని ప్రకటించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు భజ్జీ. ఇంకొకరి అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం భారతీయ కూటమిలో భాగంగా ఉందన్నారు.