SPORTS

ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం

Share it with your family & friends

ల‌క్నో చేతిలో ముంబై ప‌రాజ‌యం

ముంబై – ఐపీఎల్ 2024 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇక ప్లే ఆఫ్స్ ఎవ‌రో తేలి పోయింది. కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో భాగంగా మ‌రాఠా లోని ముంబై వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో ముంబై ప‌రాజ‌య ప‌రంప‌ర‌ను కొన‌సాగించింది. ఆ జ‌ట్టు ఈ 17వ సీజ‌న్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ముగించింది. రోహిత్ శ‌ర్మ‌ను తీసేసిన ముంబై టీం యాజ‌మాన్యం ఆగ‌మేఘాల మీద గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను తీసుకుంది. ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 215 ప‌రుగుల భారీ స్కోర్ ల‌క్ష్యంగా ముందుంచింది. అనంత‌రం టార్గెట్ ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ చ‌తికిల ప‌డింది. కేవ‌లం 196 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. దీంతో 18 ర‌న్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ , న‌మ‌న్ దుమ్ము రేపారు. అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నా చివ‌ర‌కు ముంబైకి ఓట‌మి త‌ప్ప లేదు. విచిత్రం ఏమిటంటే ముంబై ఓట‌మితో మొద‌లు పెట్టింది..చివ‌ర‌కు ప‌రాజ‌యంతో ముగించడం విశేషం.

ఇక పూర‌న్ పూన‌కం వ‌చ్చిన వాడిలా చెల‌రేగాడు. కేవ‌లం 29 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 75 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 8 సిక్స‌ర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 41 బాల్స్ ఆడి 55 ర‌న్స్ చేశాడు. 3 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి.

అనంత‌రం బ‌రిలోకి దిగిన ముంబై జ‌ట్టులో రోహిత్ శ‌ర్మ 38 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 68 ర‌న్స్ చేశాడు. న‌మ‌న్ ధీర్ 28 బంతులు ఆడి 63 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. 4 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి.