నమన్ ధీర్ సూపర్
28 బంతులు 63 రన్స్
మరాఠా – ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో పరాజయం మూటగట్టుకుంది ముంబై. స్వంత మైదానంలో నిరాశకు గురి చేసింది ఫ్యాన్స్ ను. ఈ టోర్నీలో ఓటమితో మొదలు పెట్టింది ముంబై ఇండియన్స్. ఆ తర్వాత పరాజయంతో పరిసమాప్తం చేసింది.
మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అనంతరం 215 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 196 పరుగులకే పరిమితమైంది.
ఓటమి చెందినా అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ క్రికెటర్ నమన్ ధీర్ . హిట్ మ్యాన్ 38 బాల్స్ ఎదుర్కొని 68 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక యంగ్ క్రికెటర్ నమన్ ధీర్ 28 బంతులు ఆడి 63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి.