SPORTS

ధ‌ర స‌రే రాణించింది కొంద‌రే

Share it with your family & friends

క్రికెట‌ర్లు భారీ వేత‌నాలు

హైద‌రాబాద్ – బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐపీఎల్ లీగ్ 2024 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఐపీఎల్ వేలం పాట‌లో భారీ ఎత్తున ధ‌ర‌కు ప‌లికిన ఆట‌గాళ్లలో కొందరు మాత్ర‌మే రాణించారు. త‌మ జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించారు.

ఈ 17వ సీజ‌న్ లో ఊహించ‌ని రీతిలో ధ‌ర‌కు అమ్ముడు పోయినా కొంద‌రే రాణించారు. త‌మ‌దైన రీతిలో స‌త్తా చాటారు. విచిత్రం ఏమిటంటే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు యాజ‌మాన్యం ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి కావ్య మార‌న్ అంద‌రి అంచ‌నాలు త‌ల కిందులు చేస్తూ ఆసిస్ మాజీ కెప్టెన్ పాట్ క‌మిన్స్ ను రూ. 20.50 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇది అప్ప‌ట్లో సంచ‌ల‌నం క‌లిగించింది.

మిచెల్ స్టార్క్ అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు. రూ. 24.75 కోట్ల‌కు ధ‌ర ప‌లికాడు. త‌ర్వాతి స్థానంలో నిలిచాడు క‌మిన్స్. ఇక సామ్ క‌ర‌న్ రూ. 18.5 కోట్ల‌కు అమ్ముడు పోతే , కామెరాన్ గ్రీన్ రూ. 17 . 5 కోట్ల‌కు , కేఎల్ రాహుల్ రూ. 17 కోట్లు, రోహిత్ శ‌ర్మ రూ. 16 కోట్ల‌కు ధ‌ర ప‌లికాడు.

ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు చెందిన రవీంద్ర జడేజా వేలం పాట‌లో రూ. 16 కోట్లకు ప‌లికితే, రిష‌బ్ పంత్ రూ. 16 కోట్ల‌కు, ఆండ్రీ ర‌స్సెల్ రూ. 16 కోట్ల‌కు, నికోల‌స్ పూర‌న్ రూ. 16 కోట్ల‌కు అమ్ముడు పోయారు.