NEWSNATIONAL

రాహుల్ ద‌మ్ముంటే దా

Share it with your family & friends

బీజేపీ అభ్య‌ర్థి సింగ్ సవాల్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – యూపీలో ఎన్నిక‌ల వేడి మ‌రింత రాజుకుంది. కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తున్నారు.

ప్ర‌ధానంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ర్సెస్ రాహుల్ గాంధీగా ఎన్నిక‌లు మారి పోయాయి. ఈ సారి దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు 7 విడత‌లుగా జ‌రుగుతుండ‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీకి ఆశించిన మేర సీట్లు రావ‌ని అంత‌ర్గ‌త స‌ర్వేల‌లో తేలింది. మ‌రో వైపు మోదీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆయ‌న పదే ప‌దే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు.

ప్రస్తుతం పోటీ వీరిద్ద‌రి మ‌ధ్య ఉంది. ఇద్ద‌రూ వేర్వేరు లోక్ స‌భ స్థానాల నుంచి బ‌రిలోకి దిగ‌డం ఒకింత చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. రాహుల్ గాంధీ రాయ్ బ‌రేలి నుంచి బ‌రిలో ఉండ‌గా మోదీ వార‌ణాసి నుంచి పోటీ చేస్తున్నారు.

తాజాగా ద‌మ్ముంటే చ‌ర్చ‌కు తాను సిద్ద‌మ‌ని రాహుల్ మోదీకి స‌వాల్ విసిరారు. ఈ సంద‌ర్బంగా రాయ్ బరేలి బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌తాప్ సింగ్ స్పందించారు. పీఎం అవ‌స‌రం లేద‌ని ద‌మ్ముంటే నాతో చ‌ర్చ‌కు దిగాల‌ని పిలుపునిచ్చారు.