విదేశీ పర్యటనకు జగన్
ఘనంగా వీడ్కోలు పలికిన నేతలు
అమరావతి – ఏపీలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. ఈసారి కూడా తామే పవర్ లోకి వస్తామని ప్రకటించారు వైసీపీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
50 రోజులకు పైగా ఒంటరిగా ఒకే ఒక్కడై ఎన్నికల యుద్ద రంగంలో కీలకమైన పాత్ర పోషించారు. అన్నీ తానే అయి ముందుండి ఎన్నికలను నడిపించాడు జగన్ రెడ్డి. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఇంకెన్ని ఆరోపణలు గుప్పించినా ఎక్కడా తగ్గ లేదు. వెనక్కి తిరిగి చూడలేదు.
ఇదిలా ఉండగా విశ్రాంతి లేకుండా కష్ట పడడంతో కాస్తంత సేద దీరేందుకు తన కుటుంబంతో కలిసి శుక్రవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా విమానాశ్రయం వద్ద పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున వీడ్కోలు పలికారు. ఆయన పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.