బాబు చాప్టర్ క్లోజ్ – రావెల
కిషోర్ బాబు షాకింగ్ కామెంట్స్
అమరావతి – మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం రావెల మీడియాతో మాట్లాడారు. వైసీపీ సర్కార్ పై , ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై అనరాని మాటలు అన్నాడని, అంతే కాకుండా కూటమి పేరుతో అడ్డగోలుగా ఆరోపణలు కూడా చేశారని ధ్వజమెత్తారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో తీవ్ర విమర్శలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో దేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని ఎద్దేవా చేశారు. చట్టం గురించి తెలుసుకోకుండా అవాకులు చెవాకులు పేలితే ఏం జరుగుతుందో జూన్ 4న వెల్లడయ్యే ఫలితాలతో తెలుస్తుందన్నారు.
అమరావతి రాజధాని పేరుతో చేసిన రాజకీయం, మోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇంకా ఏం చెప్పాలని ఉందో చంద్రబాబు వెల్లడిస్తే సంతోషిస్తారన్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు రావెల కిషోర్ బాబు. ఇకనైనా తప్పు తెలుసుకుని మౌనంగా ఉంటే మంచిదని సూచించారు.
తమ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం పక్కా అని జోష్యం చెప్పారు రావెల కిషోర్ బాబు.