NEWSANDHRA PRADESH

ఈ తీర్పు చెంప పెట్టు

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల

క‌డ‌ప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ‌త్య గురించి మాట్లాడ వ‌ద్దంటూ స్టే విధించ‌డాన్ని కోర్టు కొట్టి వేసింది. దీనిపై స్పందించారు ష‌ర్మిల‌.

కొంద‌రు కావాల‌ని కుట్ర ప‌న్నార‌ని, తాము వాస్త‌వాల‌ను బ‌య‌ట‌కు చెప్పీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. ఈ దేశంలో వాక్ స్వేచ్ఛ ఉంద‌నేది మ‌రోసారి రుజువు చేసింద‌ని తెలిపారు. స‌ర్వోన్న‌త న్యాయ స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు.

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్చ అన్న‌ది అత్యంత ముఖ్య‌మ‌ని, అది లేకుండా చేసే ఏ కుట్ర‌ను భ‌రించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిల‌. ఎప్ప‌టికైనా, ఏ నాటికైనా ధర్మ పోరాటంలో చివ‌ర‌కు న్యాయ‌మే గెలుస్తుంద‌ని అన్నారు.

అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసే వారికి ఈ స్టే చెంప పెట్టు అని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిల‌. ఈ విజయం తొలి అడుగు మాత్రమేన‌ని, రాబోయే రోజుల్లో, వివేకకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం జ‌రిగేంత దాకా పోరాటం ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.