మహిళల పట్ల మా వైఖరి మారదు
బాధితురాలు ఎవరైనా అండగా ఉంటాం
న్యూఢిల్లీ – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై భౌతికంగా దాడి కేసుకు సంబంధించి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల పట్ల తమ వైఖరి మారదన్నారు.
ఇదే కేసుకు సంబంధించి ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం వ్యక్తిగత సహాయకుడు బీభవ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పూర్తి కాలేదని, అంత వరకు తాము దానిపై మాట్లాడడం మంచిది కాదన్నారు పవన్ ఖేరా.
మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఆ మహిళకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ఇదే అంశానికి సంబఃధించి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటనేది ప్రియాంక గాంధీ ఇప్పటికే చెప్పారని స్పష్టం చేశారు పవన్ ఖేరా. చట్టపరమైన చర్యలను అనుసరించాలని, అందరి ముందు వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే పంజాబ్ లో కాంగ్రెస్ , ఆప్ వేర్వేరుగా పోటీ చేయడం తప్పేమీ కాదన్నారు. ప్రతిపక్ష బాధ్యతను తమకు అప్పగించారని తెలిపారు.