రాహుల్..ప్రియాంకపై మాధవీలత ఫైర్
మోదీని విమర్శించే నైతిక హక్కు లేదు
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, విరించి ఆస్పత్రి చైర్మన్ కొంపెల్లి మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గురించి మాట్లాడే హక్కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి లేనే లేదన్నారు. స్థాయిని మరిచి కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు మాధవీ లత.
ఈ సందర్బంగా తాను ఒక సూచన చేస్తున్నానని అన్నారు. అదేమిటంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఇండియాలో పోటీ చేయడం కంటే ఇటలీకి వెళ్లి బరిలో ఉంటే మంచిదని సూచించారు. ఇక్కడ వారు గెలవడం కష్టమన్నారు. అక్కడైతే ఏమో గెలవచ్చు లేదంటే ఓడి పోవచ్చని పేర్కొన్నారు.
మోదీ గురించి అత్యంత నీచమైన భాషను వాడారంటూ మండిపడ్డారు. ప్రజలు ఛీ కొట్టడం ఖాయమని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇలాంటి భాష తాము ఎప్పుడూ వాడడం లేదన్నారు. భారతీయ సంస్కృతి ఇలాంటి వాటిని ప్రోత్సహించదని స్పష్టం చేశారు కొంపెల్లి మాధవీలత.