NEWSNATIONAL

మ‌లివాల్ పై దాడి దారుణం

Share it with your family & friends

కేంద్ర మ‌త్రి పీయూష్ గోయ‌ల్

మ‌హారాష్ట్ర – కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆప్ ఎంపీ స్వాతి మ‌లివాల్ పై భౌతికంగా, లైంగికంగా దాడి చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. దీనిని ప్ర‌తి ఒక్క‌రు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు.

ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అంద‌రూ అనుకున్నంత మంచోడు కాద‌న్నారు. ఆయ‌న మేక వ‌న్నెపులి మ‌న‌స్త‌త్వం అని ఆరోపించారు. త‌న స‌మ‌క్షంలోనే ఓ స్థాయి క‌లిగిన ఎంపీపై దాడి జ‌ర‌గ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

ఈ దాడిని పార్టీలోకి అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు స్వాతి మ‌లివాల్ పై జ‌రిగిన దాడిని ఖండించాల‌ని కోరారు. ఇప్ప‌టికే జాతీయ మ‌హిళా హ‌క్కుల క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ తో పాటు ప‌లువురు స్పందించార‌ని చెప్పారు పీయూష్ గోయ‌ల్.

ఆప్ చేసే ప‌నుల‌ను ఎవ‌రూ సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేద‌న్నారు. తాము వారి గురించి ప‌ట్టించుకునే టైం త‌మ‌కు లేద‌న్నారు కేంద్ర మంత్రి. త్వ‌ర‌లోనే దోషులు ఎవ‌రో తేలుతుంద‌న్నారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు సీఎం స‌హాయ‌కుడిని అరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.