సిక్కుల పట్ల మోదీ ప్రేమ గొప్పది
ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ
న్యూఢిల్లీ – ప్రముఖ పంజాబీ గాయకుడు దలేరి మెహందీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పర్చుకున్న ఈ సింగర్ ఉన్నట్టుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. దీనికి కారణం కూడా వివరించారు. ఆయనకు సిక్కులంటే ఎనలేని ప్రేమ అని అన్నారు. దీనిని తాను దగ్గరుండి చూశానని చెప్పారు.
విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో ఎందరో ప్రధానులు ఉన్నప్పటికీ ఏనాడూ సిక్కుల గురించి ప్రత్యేకంగా శ్రద్ద చూపించిన దాఖలాలు లేవన్నారు దలేర్ మెహందీ. ఇదిలా ఉండగా మోదీ ఒక్కరే తమ పట్ల, తమ సామాజిక వర్గం పట్ల ప్రేమ కనబర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు సింగర్.
ఆయన ప్రతి ఏటా గురు గ్రంథ్ సాహెబ్ ను సందర్శించడం తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు దలేర్ మెహందీ.