బీజేపీకి అంత సీన్ లేదు
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
ఉత్తర ప్రదేశ్ – సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి పరాభవం తప్పదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల్లో తేలి యాడుతున్నాడని, ఆయన ఆశలు కల్లలు కావడం ఖాయమని జోష్యం చెప్పారు.
నిన్నటి దాకా 400 సీట్లు వస్తాయని పదే పదే ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ ఇప్పుడు మాట మార్చాడని ఆరోపించారు. ప్రస్తుతం తను గెలుస్తాడో లేడో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటూ ఎద్దేవా చేశారు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు అఖిలేష్ యాదవ్ .
20 లేదా 30 మందికి మాత్రమే ఆయన పీఎంగా ఉన్నారని 143 కోట్ల మందికి కాదన్నారు . అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ప్రజలు తీవ్రమైన నిరాశలో ఉన్నారని, ఈసారి కులం, మతం ప్రాతిపదికగా హింసోన్మాదం సృష్టించి ఓట్లు దండుకోవాలని చూసే బీజేపీకి చుక్కలు చూపించడం తప్పదన్నారు అఖిలేష్ యాదవ్.