NEWSINTERNATIONAL

సింగ‌పూర్ లో క‌రోనా తాకిడి

Share it with your family & friends

బెంగేలెత్తి పోతున్న జ‌నం

సింగ‌పూర్ – ప్ర‌పంచాన్ని నిట్ట నిలువునా ముంచేసి, భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తూ కోట్లాది మందిని పొట్ట‌న పెట్టుకున్న క‌రోనా వైర‌స్ మ‌రోసారి దాడి చేస్తోంద‌న్న వార్త జ‌నాన్ని కునుకు తీయ‌కుండా చేస్తోంది. తాజాగా సింగ‌పూర్ లో క‌రోనా అల‌జ‌డి రేపింది.

భారీ ఎత్తున క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయ్యింది. మే నెల 5 నుంచి 11 వ తేదీ వ‌ర‌కు 25,000 కు పైగా కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం క‌రోనా తాకిడి ప్రారంభ దశలో ఉందని.. రానున్న 2 లేదా 4 వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. రోజుకు 250 మంది ఆస్పత్రుల్లో చేరుతుండగా.. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు అదనపు డోస్ టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.