రైతు బిడ్డను గెలిపించండి
పిలుపునిచ్చిన ఆర్ఎస్పీ
వరంగల్ జిల్లా – విద్యాధికుడైన రాకేష్ రెడ్డి లాంటి యువకుడిని గెలిపించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీఆరెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా పరకాల, ఘనపూర్, మానుకోటలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. రాకేష్ లాంటి విద్యాధికుడు, మేధావి తప్పకుండా చట్టసభల్లో తన గళం వినిపించాలని అన్నారు. మేధావులు మౌనంగా ఉంటే అజ్ఞానులు అరాచకం సృష్టిస్తారని హెచ్చరించారు.
ఏనుగుల రాకేష్ రెడ్డి ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ. అంతే కాదు ఆర్థికవేత్త, బిట్స్ పిలానీ కాలమిస్ట్, టీవీ ప్యానలిస్ట్, మంచి రచయిత కూడా అని ప్రశంసించారు. రాజకీయాల్లో రాకేష్ అనుగుల చాలా కొద్ది మంది బిట్స్‌యన్లలో ఒకరు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాకేష్ ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ అని తెలిపారు.
నిర్మాణ్ సంస్థను స్థాపించి నిరుపేద పిల్లల విద్యాభివృద్ది కోసం కృషి చేశారని ప్రశంసించారు ఆర్ఎస్పీ. కార్తికేయన్ అవార్డు గ్రహీత కూడా అని తెలిపారు. రాకేష్ రెడ్డి అమెరికాలో జేపీ మోర్గాన్ చేజ్, సిటీ బ్యాంక్, జింగా వంటి కార్పొరేట్ సంస్థల్లో ఆరేళ్ల పాటు పెట్టుబడి బ్యాంకింగ్, అనలిటిక్స్ రంగంలో పనిచేశాడని అన్నారు.