NEWSTELANGANA

గెలిపిస్తే సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తా

Share it with your family & friends

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాకేష్ రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా – వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం ఆయ‌న ప్ర‌చారం చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను నిరుద్యోగులు , ప‌ట్ట‌భ‌ద్రులు గ‌నుక గెలిపిస్తే త‌న‌కు వ‌చ్చిన వేత‌నాన్ని మొత్తం విద్యార్థి, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్ర‌త్యేకంగా కేటాయిస్తాన‌ని, అంతే కాకుండా ఓ నిధిని కూడా జ‌మ చేస్తాన‌ని తెలిపారు.

త‌న జీవితం అంతా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని ప్ర‌క‌టించారు. ఏనాడూ అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు. స‌మాజంలో మార్పు తీసుకు రావాల‌న్న ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లుగా రాజ‌కీయాల‌లో కొన‌సాగుతూ వ‌చ్చాన‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పై అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు రాకేష్ రెడ్డి అనుగుల‌. ప్ర‌జ‌లు, ముఖ్యంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తాన‌ని, వారి త‌ర‌పున త‌న గొంతు వినిపిస్తాన‌ని చెప్పారు.