NEWSNATIONAL

మోదీ గెలిస్తే జాబ్స్ రావు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రాహుల్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు సిట్టింగ్ ఎంపీ , ప్ర‌స్తుత రాయ్ బ‌రేలి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ కూట‌మి అభ్య‌ర్థి రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు.

ఆయ‌న వ‌ల్ల దేశం స‌ర్వ నాశ‌నం అయ్యింద‌ని, వందేళ్లు వెన‌క్కి వెళ్లింద‌న్నారు. కొత్త‌గా ఒక్క ప‌రిశ్ర‌మ కూడా రాలేద‌న్నారు. కులం పేరుతో, మ‌తం పేరుతో, ఆధ్యాత్మిక‌త పేరుతో, ఆల‌యాల పేరుతో కాలం వెళ్ల బుచ్చ‌డం త‌ప్ప ఆయ‌న దేశం కోసం చేసింది ఏమీ లేద‌న్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఏటా 2 కోట్ల జాబ్స్ భ‌ర్తీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప్ర‌ధాని ఒక్క పోస్టు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను నాశ‌నం చేశాడ‌ని, త‌న వారికి అప్ప‌నంగా అప్ప‌గించాడ‌ని మ‌రోసారి గ‌నుక మోదీ పీఎం అయితే దేశాన్ని అమ్మేస్తాడ‌ని, ఇక మీకు జాబ్స్ రావంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాహుల్ గాంధీ.