సీసీ ఫుటేజ్ డేటాను తొలగించారు
స్వాతి మలివాల్ సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ – ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగిన కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఆమె తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరింది. జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఆమెకు రక్షణ గా ఉంటామని ప్రకటించింది.
ఇదే సమయంలో తనపై సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బీభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. చివరకు ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేశారు.
సీఎం ఇంటిని సోదా చేశారు. ఆయన సహాయకుడిని అరెస్ట్ కూడా చేశారు. ఇదిలా ఉండగా కోర్టులో స్వాతి మలివాల్ ను హాజరు పర్చగా వైద్య పరీక్షలు చేయించాలంటూ ఆదేశించింది కోర్టు. దీంతో ఎయిమ్స్ లో ఆమెకు పరీక్షలు చేపట్టగా గాయాలైనట్లు తేల్చింది నివేదిక.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆప్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో స్వాతి మలివాల్ ఎలాంటి దాడికి గురి కాలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా తనపై జరిగిన దాడికి సంబంధించి ఫుటేజ్ ను డిలీట్ చేశారంటూ ఆరోపించింది స్వాతి మలివాల్.