మోసానికి చిరునామా మోడీ
నిప్పులు చెరిగిన కేటీఆర్
నల్లగొండ జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధాని మోడీపై మండిపడ్డారు. ఈ దేశానికి ఏం చేశారో చెప్పాలన్నారు. నిత్యం అబద్దాల పునాదులపై తన పాలన సాగించారని ఆరోపించారు.
ఆదివారం ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్.
ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా అన్నారని కానీ ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. విదేశాల నుంచి మన పాస్‌పోర్ట్ కోసం ఎగబడేలా చేస్తా అంటూ నమ్మించారని చివరకు ఒక్కరు కూడా రాలేదన్నారు.
విచిత్రం ఏమిటంటే మోడీ దెబ్బకు జనం దేశాన్ని విడిచి వెళ్లి పోతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పారని, రైతులను నిట్ట నిలువునా ముంచారని అన్నింటినీ అదానికి దోచి పెడుతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ప్రశ్నించే వాళ్లు చట్ట సభల్లో ఉండాలని, విద్యాధికుడైన రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు.