NEWSNATIONAL

క‌న్న‌డ నాట కాంగ్రెస్ దే హ‌వా

Share it with your family & friends

ఆశించిన దానికంటే సీట్లు

క‌ర్ణాట‌క – రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య సంతోషంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నారు. ఐదు గ్యారెంటీల‌తో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్పుడు మెరుగైన పాల‌న అందిస్తోంది. ప్ర‌స్తుతం జరుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ త‌ప్ప‌ద‌ని పేర్కొన్నారు సీఎం.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ప్ర‌జ‌లు మెరుగైన పాల‌న‌ను, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నార‌ని అందుకే పెద్ద ఎత్తున ఓట‌ర్లు ఓటు వేశార‌ని చెప్పారు. సిద్ద‌రామ‌య్య ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయ‌న విక్ట‌రీ గుర్తు సూచిస్తూ తాము గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

ఈసారి పార్ల‌మెంట్ స్థానాల‌ను అత్య‌ధికంగా తాము కైవ‌సం చేసుకుంటామ‌ని , భార‌తీయ జ‌న‌తా పార్టీ, జేడీఎస్ కూట‌మికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని జోష్యం చెప్పారు. మోదీ త‌న స్థాయి ఏమిటో ఇప్ప‌టికైనా తెలుసుకుంటే మంచిద‌న్నారు. ఆయ‌న క‌ల‌లు కంటున్నార‌ని, క‌న‌డంలో త‌ప్పు లేద‌న్నారు. కానీ వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోకుండా చ‌ర్య‌ల‌కు దిగితే జ‌నం ఊరుకోర‌ని అన్నారు.