ఇండియా కూటమిదే అధికారం
మరాఠాలో మాదే రాజ్యం
మహారాష్ట్ర – శివసేన యూబిటి చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ఆయనపై నిప్పులు చెరిగారు. అబద్దాలతో ఇంకెంత కాలం దేశాన్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. నిజం నిలకడ మీద తేలుతుందని , ఏనాటికైనా ధర్మం గెలుస్తుందని అన్నారు.
ఇంత కాలం జనాన్ని మోసం చేస్తూ వచ్చిన మోదీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఇవాళ దేశ వ్యాప్తంగా మోదీకి ఎదురు గాలి వీస్తోందని చెప్పారు. ఇవాళ మహారాష్ట్రంలో ప్రజానీకం మొత్తం గంప గుత్తగా ఇండియా కూటమి వైపు ఉన్నారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
మోదీ పదే పదే 400 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారని కానీ బీజేపీ కూటమికి కనీసం 200 సీట్లు కూడా రావని అన్నారు. వచ్చే నెల జూన్ 4న భారత కూటమి ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి తాను మోదీని ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఉద్దవ్ ఠాక్రే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.