ప్రమాదంలో రాజ్యాంగం – రాహుల్
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
ఉత్తర ప్రదేశ్ – ఈ దేశంలో ప్రస్తుతం ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో ఆయన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ప్రచారం చేపట్టారు. ఊహించని రీతిలో ఏకంగా 2 లక్షల మందికి పైగా జనం హాజరయ్యారు. అశేష ప్రజానీకం ఈ యువ నాయకులకు జేజేలు పలికారు.
ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అత్యంత ప్రమాదంలో ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు తమకు తోచిన రాజ్యాంగాన్ని తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ దేశంలో పేదలు, బడుగు, బలహీనులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు , ఇతర నిమ్న వర్గాలకు రక్షణ కావాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ తన హిందూత్వ ఎజెండాతో ముందుకు వస్తున్నారని, ఆయన కేవలం గుప్పెడు మంది డబ్బున్న వాళ్లకు మాత్రమే మేలు చేకూర్చేలా చేస్తున్నారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.