సీఎం ల్యాప్ టాప్..సీసీ టీవీ సీజ్
అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్
న్యూఢిల్లీ – దేశ రాజధానిలో రాజకీయం మరింత రంజుగా మారింది. ఆప్ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు ఆప్ ఎంపీ , ఢిల్లీ విమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్. తనపై దాడి జరిగిందని, చెప్పలేని చోట గాయాలు కూడా అయ్యాయని వాపోయింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కోర్టు కూడా విచారణకు ఆదేశించింది.
ఇదే సమయంలో తనపై దాడి జరుగుతున్న సమయంలో ఇంట్లోనే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని ఆరోపించారు బాధితురాలు. కానీ పట్టించు కోలేదని వాపోయారు. చివరకు ఆమె చేసిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. విచారణకు ఆదేశించినట్లు తెలిపారు చైర్ పర్సన్ రేఖా శర్మ.
ఇదిలా ఉండగా ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తన పరివారంతో కలిసి ఢిల్లీలోని బీజేపీ ఆఫీసు వద్దకు బయలు దేరారు. తామంతా వచ్చామని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసు టీం ఇవాళ కేజ్రీవాల్ నివాసం నుండి ల్యాప్ టాప్ తో పాటు సీసీటీవీ డీవీఆర్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సీఎం.