ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్
రామ మందిరం వర్కవుట్ కాలేదు
బీహార్ – ప్రముఖ భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై స్పందించారు. ఆశించిన మేర భారతీయ జనతా పార్టీకి సీట్లు రాక పోవచ్చని అన్నారు. అయితే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
అయితే ప్రశాంత్ కిషోర్ అయోధ్య లోని రామ మందిరంపై ఆసక్తికర కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. ప్రధానంగా బీజేపీ వర్గాలలో అంతర్మథనం చోటు చేసుకునేలా చేసింది. ఆయన ఏమన్నారంటే మోదీ పరివారం అంతా ఎక్కువగా రామ జన్మ భూమి , అయోధ్య టెంపుల్ పై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారని అన్నారు.
కానీ టెంపుల్ నిర్మాణం ఏ మాత్రం బీజేపీకి సహాయకారిగా ఉండలేక పోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రామ మందిరం ఆధారంగా ఆ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయలేదన్నారు. మందిర్ పట్ల బిజెపి మద్దతుదారులు మాత్రమే ఉత్సాహంగా ఉన్నారని ఇతరులు అలా లేరని అన్నారు. జనం కోసం ఏం చేస్తున్నామనేది ముఖ్యమని పేర్కొన్నారు.