NEWSNATIONAL

తొడ గొట్టిన క‌న్హ‌య్య కుమార్

Share it with your family & friends

ఇండియా కూట‌మిదే గెలుపు

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఇండియా కూట‌మికి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్ర‌ధానంగా దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌ట్ల ఏమాత్రం అవ‌గాహ‌న లేని మోదీ ఉండ‌డం ఇబ్బందిక‌రంగా మారింద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఈశాన్య ఢిల్లీ ఇండియా కూట‌మి అభ్య‌ర్థి క‌న్హ‌య్య కుమార్.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న తొడ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సంచ‌ల‌నంగా మారాయి. ఆరు నూరైనా స‌రే ఈసారి తాము విజ‌యం సాధించ బోతున్నామ‌ని, 143 కోట్ల మంది భారతీయులంతా ఒకే నినాదంతో ముందుకు వ‌స్తున్నార‌ని చెప్పారు. వారంతా ప్ర‌భుత్వం మారాల‌ని, మోదీ ఇంటికి వెళ్లాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు.

ఈ దేశం గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆందోళ‌న‌లో ఉంద‌న్నారు. ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని, భార‌త రాజ్యాంగం అత్యంత క్లిష్ట ద‌శ‌ను ఎదుర్కొంటోంద‌ని వాపోయారు క‌న్హ‌య్య కుమార్. ఏది ఏమైనా మ‌నం ఇక‌నైనా ఇప్పుడైనా మేలుకోవాల‌ని లేక పోతే మ‌నంద‌రికీ భ‌విష్య‌త్తు అంటూ ఉండ‌ద‌న్నారు.