సర్కార్ ను కూల్చడమే బీజేపీ పని
నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీని ఉద్దేశించింది. తాను పవర్ లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా చేయని కుట్ర అంటూ లేదన్నారు. వారి అక్కసు అంతా తాము దేశ రాజధానిలో పాగా వేయలేక పోయామని, తమకు అధికారం లేక పోయిందనే బాధ తప్ప ఇంకోటి లేదని మండిపడ్డారు.
ఢిల్లీ వాసులు ఆప్ ను అక్కున చేర్చుకున్నారని , వారు మోదీ, అమిత్ షా చేసే కుట్రల గురించి తెలుసుకున్నారని అందుకే తమను ఆదరిస్తూ వస్తున్నారని చెప్పారు. ఎన్నో లెక్కకు మించి ఆరోపణలు చేశారని, ఇంకా చేస్తూనే వస్తున్నారని ఆరోపించారు. ఇంకెంత కాలం అబద్దాల పునాదుల మీద పాలన సాగిస్తారంటూ ప్రశ్నించారు మోదీని.
ఆరు నూరైనా ఆప్ ను అంతం చేసే కుట్ర సాగదన్నారు. దానిని ఢిల్లీ ప్రజలే కాపాడుకుంటూ వస్తారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కేజ్రీవాల్. తనపై లిక్కర్ స్కామ్ కేసు మోపారని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బయటకు దొరికినట్లు చూపించ లేదని చెప్పారు సీఎం.