బీజేపీ మైండ్ గేమ్ వర్కవుట్ కాదు
సీపీఐ కార్యదర్శి నారాయణ కామెంట్
గుంటూరు జిల్లా – సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రస్తుతం మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు కన్హయ్య కుమార్ పై దాడి చేశారని ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందన్నారు. విచిత్రం ఏమిటంటే పీఎం మోదీ, బీజేపీ పదే పదే 400 సీట్లు వస్తాయంటూ మైండ్ గేమ్ ఆడుతోందంటూ ధ్వజమెత్తారు. వారి ఆటలు సాగవన్నారు.
కేంద్రంలో బీజేపీ కూటమి ఓడి పోతోందని, ఇండియా కూటమి పవర్ లోకి వస్తోందని జోష్యం చెప్పారు సీపీఐ నారాయణ. రాస్ట్రంలో ప్రభుత్వం కూడా మారే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం ముస్లింలంతా గంప గుత్తగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. తెలుగు ప్రజలందరికీ మొదటి శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరో కాదు పీఎం మోదీనేనంటూ ఎద్దేవా చేశారు. నారాయణ.
ఆయన మాజీ సీజేఐ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతిని ఎన్ని రకాలుగా చేయొచ్చో జగన్ రెడ్డిని చూస్తే చాలాన్నారు.