ఆరు నెలల్లో పీఓకే స్వాధీనం
ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యానాథ్
ఉత్తర ప్రదేశ్ – పార్లమెంట్ ఎన్నికల వేళ సంచలన ప్రకటన చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పాలకులం కాదన్నారు. ఇప్పుడు ఉన్నది బలవంతమైన, శక్తివంతమైన ప్రభుత్వం అని చెప్పారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నంత వరకు ఏ ఒక్క దేశం ఇటు వైపు చూసే సాహసం చేయదని ప్రకటించారు.
అంతే కాదు తాము ఈ ఎన్నికల వేళ ప్రకటిస్తున్నామని కేవలం ఆరు నెలల్లోపే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఏ మాత్రం దూకుడు ప్రదర్శించినా లేదా చిల్లర వేషాలు వేసినా చివరకు నష్ట పోయేది, భంగ పడేది మాత్రం పాకిస్తానేనంటూ స్పష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్.
ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరు సుఖంగా నిద్ర పోవాలంటే బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని, శక్తివంతమైన నాయకుడైన నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేయాలని అన్నారు. ఇందు కోసం మీ వంతుగా భారీ మెజారిటీతో ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు యోగి ఆదిత్యానాథ్.