మోదీ చర్చకు సిద్దమా – రాహుల్
సవాల్ విసిరిన కాంగ్రెస్ అభ్యర్థి
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి సవాల్ విసిరారు. ఎన్నికల్లో భాగంగా కేవలం వ్యక్తిగత ప్రచారంపైనే ఫోకస్ పెట్టారని ఏనాడూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించు కోలేదని అన్నారు.
ఆయన పదే పదే 400 సీట్లు వస్తాయంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని కానీ వాస్తవానికి ఆ పార్టీకి , దాని అనుబంధ పార్టీలకు మేజిక్ ఫిగర్ కూడా రావన్నారు. ఇది అక్షర సత్యమన్నారు. ఆయన గత కొన్ని రోజుల్లో పదే పదే ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారని కానీ అందులో తాను చెప్పింది వినడం తప్ప జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు జవాబులు ఏవి అని ప్రశ్నించారు.
5 నుంచి 10 మంది జర్నలిస్టులకు 30 నుంచి 35 దాకా ఇంటర్వ్యూలు మోదీ ఇచ్చారని ఇందులో దేశానికి సంబంధించినది ఏమైనా ఉందా అని నిలదీశారు రాహుల్ గాంధీ. ఇందుకేనా మిమ్మల్ని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నది. మీ ప్రచారం కోసం కాదు దేశానికి ఏమైనా చేస్తారని ఆశించారని కానీ ఎక్కడా ఒక్కటన్నా మంచి పని ఏమైనా చేశారా అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మరి తాను సవాల్ విసురుతున్నానని బహిరంగ చర్చకు సిద్దమేనా అని మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు.