అవినీతిపరులు ఇక జైల్లోనే – మోదీ
పశ్చిమ బెంగాల్ సభలో ప్రకటన
పశ్చిమ బెంగాల్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి దేశంలో ఏ ఒక్క అవినీతి పరుడు ఉన్నా లేదా అవినీతికి పాల్పడినా సహించే ప్రసక్తి లేదన్నారు. తాము 400 సీట్లకు పైగా సాధించ బోతున్నామని, జూన్ 4 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పురూలియా లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అవినీతి పరులపై నిప్పులు చెరిగారు. తాట తీస్తానని అన్నారు. వచ్చిన వెంటనే వెంటాడి వారందరినీ జైల్లోకి తోస్తానని ప్రకటించారు మోదీ.
అవినీతి పరులు ప్రస్తుతం దేశంలో యధేశ్చగా తిరుగుతున్నారని, కానీ తాను వారికి చుక్కలు చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇంత కాలం మోదీని ఒక వైపు మాత్రమే చూశారని, కానీ ఇక నుంచి కొత్త మోడీని చూడ డోతున్నారని పేర్కొన్నారు.
అవినీతి పరులంతా ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే జైల్లోనే ఉండేలా చేస్తానని మీకు హామీ ఇస్తున్నానని అన్నారు నరేంద్ర మోదీ.