NEWSNATIONAL

షా క‌న్ ఫ‌ర్మ్ మోదీ పీఎం

Share it with your family & friends

ప్లాన్ బి అంటూ ఇంకోటి లేదు

న్యూఢిల్లీ – ఇండియా కూట‌మికి అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా. ఆయ‌న ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ , ఏఎన్ఐ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ స్మితా ప్ర‌కాష్ తో మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా స్మితా అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ఒక‌వేళ బీజేపీ సంకీర్ణ పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక పోతే మ‌రో ప్లాన్ ఏమైనా రెడిగా ఉందా అని ప్ర‌శ్నించారు. దీనికి స్పందిస్తూ అలాంటి అవ‌స‌రం రాబోద‌న్నారు. త‌న‌కు ప‌క్కా స‌మాచారం ఉంద‌న్నారు.

తమ బీజేపీ కూట‌మికి క‌నీసం 400 కు త‌క్కువ రావ‌ని అన్నారు. ఇప్ప‌టికే నాలుగు విడ‌త‌లుగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 380 సీట్లు త‌మ‌కు రాబోతున్నాయ‌ని జోష్యం చెప్పారు అమిత్ షా. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ప్ర‌ధాన‌మంత్రిగా ముచ్చ‌ట‌గా మూడోసారి న‌రేంద్ర మోదీ కొలువు తీర బోతున్నార‌ని రాసి పెట్టుకోండి అంటూ స్ప‌ష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి. ఇండియా కూట‌మి నేత‌లు భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్నార‌ని వారిని అలానే ఉండ‌నీయాల‌ని లేక పోతే దేశాన్ని నాశ‌నం చేస్తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు షా.