హైదరాబాద్ జోర్దార్ పంజాబ్ బేజార్
అభిషేక్..క్లాసెన్ సూపర్ షో
హైదరాబాద్ – ఐపీఎల్ 2024లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ దర్జాగా ప్లే ఆఫ్స్ కు వెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ ను వెనక్కి నెట్టేసింది పాయింట్ల పట్టికలో. మొత్తంగా ఊహించని రీతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం నాలుగు జట్ల జాబితాలోకి చేరడం విశేషం.
హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సైతం అద్బుతంగా ఆడింది. భారీ స్కోర్ చేసింది. 214 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించింది. ప్రధానంగా అభిషేక్ శర్మ, క్లాసెన్ లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ఇంకా ఓ ఓవర్ ఉండగానే పని పూర్తి కానిచ్చేసింది. శర్మ 66 రన్స్ చేస్తే క్లాసెన్ 42 పరుగులు చేశారు. కమిన్స్ టీం 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. శర్మ, హెన్రిచ్ కు తోడుగా నితీశ్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 37 పరుగులు చేశాడు.
అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపింది. హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 69 రన్స్ చేస్తే రూసో 49 , అథర్వ తైడే 46 పరుగులతో రాణించారు. కెప్టెన్ జితేశ్ శఱ్మ 32 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో 5 కోల్పోయి 214 రన్స్ చేసింది.