అనూహ్య స్పందన అపూర్వ ఆదరణ
రాహుల్ గాంధీ..అఖిలేష్ యాదవ్ వైరల్
ఉత్తర ప్రదేశ్ – దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 400 సీట్లకు పైగా వస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన పరివారం పదే పదే ప్రచారం చేస్తున్నా వాస్తవానికి అంతగా జనం ఆదరించడం లేదని తేలి పోయింది.
రోజు రోజుకు మోదీ చరిష్మా పని చేయడం లేదు. ఇందుకు భిన్నంగా నిన్నటి దాకా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని అనరాని మాటలు అంటూ , వ్యక్తిగతంగా దూషిస్తూ..బీజేపీ వాట్సాప్ యూనివర్శిటీలో పదే పదే ప్రచారం చేస్తూ వచ్చింది.
కానీ ఊహించని రీతిలో రాహుల్ గాంధీకి విపరీతమైన జనాదరణ లభిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఆయనను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. తమ సమస్యలకు ఆయన పరిష్కారం చూపిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షాలతో కూడిన భారతీయ కూటమి అత్యధిక స్థానాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
యూపీలో 3 లక్షల మందికి పైగా జనం పోగయ్యారు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ను చూసేందుకు. పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగా సమావేశం నుంచి మాట్లాడ కుండానే వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.