SPORTS

అభిషేక్ శ‌ర్మ వైర‌ల్

Share it with your family & friends

స‌న్ రైజ‌ర్స్ లో సూప‌ర్

హైద‌రాబాద్ – ఐపీఎల్ 2024లో దుమ్ము రేపుతోంది ప్యాట్ క‌మిన్స్ సార‌థ్యంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ . మ‌నోడిని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది ఆ జ‌ట్టు సీఈవో కావ్య మార‌న్. అంద‌రూ ఆమె తీసుకున్న నిర్ణ‌యంతో విస్తు పోయారు. త‌ను వ‌చ్చాక టీమ్ స్వ‌రూపం మారి పోయేలా చేశాడు. అంద‌రితో క‌లిసిమెలిసి ఆడేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

గ‌త ఏడాది జ‌రిగిన ఐపీఎల్ సీజ‌న్ లో ఆశించిన మేర రాణించ లేక పోయింది స‌న్ రైజ‌ర్స్. ప్ర‌ధానంగా ట్రావిస్ హెడ్ , నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. జ‌ట్టు ప‌రంగా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో సైతం స‌త్తా చాటారు.

ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది విశాఖ‌కు చెందిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ‌ర్ గా త‌న ప్ర‌తాపం చూపించాడు. ఇదే స‌మ‌యంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు చెందిన అభిషేక్ శ‌ర్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను ఓపెన‌ర్ గా విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ తో అల‌రించాడు. ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేశాడు అభిషేక్ శ‌ర్మ‌.

ఆఖ‌రి లీగ్ మ్యాచ్ సంద‌ర్బంగా పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా గెలుపొందేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో అభిషేక్ శ‌ర్మ వైర‌ల్ గా మారాడు నెట్టింట్లో.