మండలిలో ప్రశ్నించే గొంతు కావాలి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి కేటీఆర్
ఖమ్మం జిల్లా – భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో ప్రశ్నాంచే గొంతుకలు ఉండాలని , ప్రశంసించే గొంతులు ఉండ కూడదని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నల్లగొండ – వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎంపిక చేసిన రాకేష్ రెడ్డికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా ప్రజల తరపున ప్రశ్నిస్తూ వస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి గొంతుకలను ఆదరించాల్సిన అవసరం పట్టభద్రులపై ఉందన్నారు కేటీఆర్.
ఇల్లందు పట్టభద్రుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొని ప్రసంగించారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు.
సీఎంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటికైనా విద్యాధికుడైన రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు.